ప్రజాశక్తి-పాడేరు టౌన్:అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు జిల్లా ఆసుపత్రిని: రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ వి.రామి రెడ్డి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సికిల్ సెల్ అనీమియా, తలసీమియా నిర్ధారణ పరీక్షలకు సంబంధించి ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన హెచ్ పిఎల్‌సి బయో ర్యాడ్ మెషిన్, ల్యాబ్‌ను పరిశీలించారు. ల్యాబ్‌లో ఇప్పటి వరకు సేకరించిన నమూనాలు, నిర్ధారించిన కేసుల వివరాలను డిసి హెచ్‌ఎస్ శంఖర్ ప్రసాద్‌ను అడిగి తెలుసుకున్నారు. గిరిజన ప్రాంతంలో గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న సికిల్ సెల్ అనీమియా, తలసీమియా అనుమానిత విద్యార్థులకు నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వ్యాధి నిర్ధారణ అనంతరం రోగులకు మెరుగైన వైద్యంతో పాటు పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. బ్లడ్ బ్యాంక్ ద్వారా అవసరమైన రోగులకు రక్త యూనిట్లు అందించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థుల సిక్ వార్డు, ఎన్‌ఆర్‌సి విభాగ వార్డు, అత్యవసర రోగుల వార్డు, టెస్టుల యంత్ర పరికరాలు పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా త్వరితగతిన నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న మందులను, రికార్డులను పరిశీలించారు. ఎపిడమిక్ సీజన్ సమీపిస్తున్నందున జిల్లా ఆసుపత్రి, పిహెచ్‌సిల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జమాల్ భాషా, డిసిహెచ్‌ఎస్ శంఖర్ ప్రసాద్, జిల్లా మలేరియా అధికారి సాంబ మూర్తి, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.