మాట్లాడుతున్న కలెక్టర్
రోగులకు మెరుగైన సేవలందించాలి
-జిజిహెచ్‌ని సందర్శించిన కలెక్టర్
ప్రజాశక్తి-నెల్లూరు:నగరంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు అన్నీ విభాగాల్లో వైద్య సేవలను మెరుగుపర్చాలని కలెక్టర్ యం. హరి నారాయణన్, వైద్యులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ హరి నారాయణన్ నగరంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ( జిజిహెచ్) ని సందర్శించి ఆసుపత్రి సూపరింటిండెంట్, వైద్యులతో సమావేశమై జిజిహెచ్ లో అందిస్తున్న వైద్య సేవలను, ల్యాబ్స్, ఆపరేషన్ థియేటర్స్, బ్లడ్ బ్యాంక్ పరిస్థితి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చికిత్స కోసం జిజిహెచ్ కు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వైద్య సేవలను అందించడంలో అలసత్వం వహించిన వైద్యులు, వైద్య సిబ్బంది పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా మాతా శిశు సంరక్షణకు ప్రత్యేక దష్టి సారించాలని వైద్యులను ఆదేశించారు. జిజిహెచ్ లో నిర్వహిస్తున్న రక్త నిధి కేంద్రాన్ని పటిష్టంగా నిర్వహించడంతో పాటు రోగులకు అవసరమైన రక్తాన్ని సకాలంలో రోగికి అందేలా ప్రణాళికాబద్దంగా ముందుకు అడుగులు వేయాలని కలెక్టర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ ను ఆదేశించారు. రోగులకు అవసరమైన రక్తాన్ని సేకరించడంలో వైద్యులు ప్రత్యేక శ్రద్ద తీసుకొని బ్లడ్ డొనేషన్ క్యాంపు లను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సెంట్రల్ డయాగ్నోసిస్ బ్లాక్ కు అవసరమైన సివిల్ వర్క్ లు, ఏసి ల ఏర్పాటు, విద్యుదీకరణ, తదితర పనులు పూర్తి చేసి నెల రోజుల లోపు జిజిహెచ్ లోని అన్నీ విభాగాల వైద్య పరీక్షలు సెంట్రల్ డయాగ్నోసిస్ బ్లాక్ లో నిర్వహించాల్సిన బాధ్యత ఆసుపత్రి సూపరింటెండెంట్, ఎపిఎంఐడిసి డిఈ, సంబంధిత విభాగాల హెచ్‌ఓడి లపై వుందని స్పష్టం చేశారు. అనంతరం కలెక్టర్ సెంట్రల్ డయాగ్నోసిస్ బ్లాక్ ను పరిశీలించారు. నెల రోజుల లోపు అన్నీ విభాగాలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించేలా సెంట్రల్ డయాగ్నోసిస్ బ్లాక్ ను వినియోగంలోని తీసుకురావాలని ఆదేశించారు. అనంతరం రక్త నిధి కేంద్రాన్ని తనిఖీ చేశారు. రక్త నిధి కేంద్రంలో అవసరమైన వైద్య పరికరాలను కొత్తవి కొనుగోలుకు చర్యలు తీసుకోవడంతో పాటు మరమ్మత్తు చేయాల్సి వుంటే సంబంధిత వైద్య పరికరాలను తక్షణం మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకోవాలని ఎపిఎంఐడిసి డిఈ ను ఆదేశించారు. అనంతరం ప్రసూతి మరియు చిన్న పిల్లల భవనాన్ని సందర్శించి చిన్న పిల్లల వార్డును తనిఖీ చేసి చేపట్టాల్సిన మౌలిక సదుపాయాలను అడిగి తెలుసుకొన్నారు. చిన్న పిల్లల వార్డులో వైద్య సేవల పట్ల కలెక్టర్ అసంతప్తి ని వ్యక్తం చేస్తూ, చిన్న పిల్లల వైద్య సేవలను మెరుగుపర్చాలని సంబంధిత వైధ్యులను ఆదేశించారు. ఓ.టి బ్లాక్ ను ఒక నెల లోపు వినియోగంలోకి తీసుకురావాలని, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ ను, ఎపిఎంఐడిసి డిఈ ను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ ప్రత్యేక నవజాత శిశు విభాగాన్ని సందర్శించి అందచేస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. గర్భిణీలకు, చిన్న పిల్లలకు వైద్య సేవలందించడంలో వైద్యులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో జి జి హెచ్ సూపరింటిండెంట్ డాక్టర్. నరేంద్ర, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. పెంచలయ్య, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. జమున, జిజిహెచ్ అభివద్ది సొసైటీ కమిటీ కో ఆర్డినేటర్ లక్ష్మి సునంద, వివిధ విభాగాల హెచ్‌ఓడి లు, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










