Nov 21,2023 19:10

వైద్యపరీక్షలు చేస్తున్న దృశ్యం

వైద్యపరీక్షలు చేస్తున్న దృశ్యం
రోగులకు కాకర్ల వైద్య సేవలు
ప్రజాశక్తి-సీతారామపురం:ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ నాయకులు కాకర్ల సురేష్‌ ఏర్పాటు చేసిన కాకర్ల చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని పేద ప్రజల కోసం ఎన్టీఆర్‌ సంజీవనీ ఆరోగ్య రథం ద్వారా ఉచిత వైద్య సేవలు, ఉచిత మందుల పంపిణీ చేస్తున్న విషయం విధితమే. అందులో బాగంగా 182వ రోజైన మంగళవారం ''సంజీవని ఆరోగ్యరథం ద్వారా మండలంలోని నెమళ్ల దిన్నె పంచాయతీ లోని గంగవరం గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల వద్ద వద్ద అనారోగ్య సమస్యలు ఉన్న గ్రామస్తులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయడంతో పాటుగా ఉచితంగా మందులు పంపిణీతో కూడిన వైద్య సేవలందించారు.95 మంది గ్రామస్తులకు డాక్టర్‌లు వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. 62 మంది కంటి చూపు సమస్యలకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం 157 మంది చికిత్స తీసుకున్నారు.వీరందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నెమళ్లదిన్నె సర్పంచ్‌ తోకల రామచంద్ర, టిడిపి నాయకుడు ఇజ్రాయిల్‌ ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.