Sep 14,2023 00:27

ప్రజాశక్తి - పర్చూరు
రోగాలు పోయి అందరూ ఆరోగ్యంగా ఉండాలని ముస్లిం మహిళలు ప్రార్ధనలు చేశారు. అందరికి ఆరోగ్యవంతమైన జీవితాన్ని ప్రసాదించాలని అల్లాని ప్రార్ధించారు. మండలంలోని ఉప్పుటూరులో ముస్లిం మహిళలు వాటర్ ట్యాంక్ వద్ద బుధవారం సామూహిక ప్రార్ధనలు చేశారు. ఇస్లాం మతం తేరాతేజి నెలలో చివరి బుధవారానికి ఒక ప్రత్యేకత ఉందని మత పెద్ద షేక్ ఆషాబి తెలిపారు. పవిత్ర ఖురాన్ ప్రకారం ప్రవక్త మొహమ్మద్ ముస్తఫా రసూల్ తన అనారోగ్యం పోవాలని చివరి బుధవారం ప్రార్ధనలు చేశారని తెలిపారు. ప్రార్ధనల అనంతరం ఆయన పూర్తి ఆరోగ్య వంతుడిగా మారిపోయినట్లు ఆమె వివరించారు. దానికి గుర్తుగా రాష్ట్రంలో ఉన్న రోగులందరు ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని ప్రార్ధనలు చేసినట్లు తెలిపారు. అనంతరం అందరికి ఫలహారాన్ని పంచిపెట్టారు. కార్యక్రమంలో షేక్ నూర్జహా, షేక్ ఖాతుంబి, షేక్ మైమున్, షేక్ కామిలా, షేక్ ప్యారి, షేక్ ఖాజాబి, షేక్ బషీరున్, షేక్ ఖాసీంబి, షేక్ ఖాదర్బి, షేక్ షాకిరున్, సయ్యద్ మహబూబ్బి పాల్గొన్నారు.