Nov 09,2023 17:42

రోడ్లు అధ్వాన్నం

నెల్లూరు అర్బన్‌ : నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలోని 29వ డివిజన్‌ లో ఉన్న సుభాష్‌ చంద్రబోస్‌ నగర్‌ , ఆటో నగర్‌ ప్రాంతాల్లో చినుకు రాలితే చిత్తడిగా మారిపోతుందని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గి శెట్టి సుజరు బాబు విమర్శించారు. గురువారం 29వ డివిజన్‌లోని పలు ప్రాంతాలను ఆయన జన సైనికులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నెల్లూరులో కొద్దిపాటి వర్షాఆనికి రోడ్లు జలమయం అవుతున్నాయన్నారు. నగరంలో వాహనాల మర మ్మతుల కోసం అనేకమంది ప్రజలు ఆటోనగర్‌ కు వస్తుంటారని, ఇక్కడ వేల మంది ఉపాధి నిమిత్తం వస్తుంటారన్నారు. రోడ్లు సరిగా లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రోడ్ల స్థితిపై రెండు మూడు రోజుల్లో స్థాని కులతో కలిసి జిల్లా కలెక్టర్‌ , కార్పొరేషన్‌ కమిషనర్‌ ను కలిసి వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుందరరామిరెడ్డి, రూరల్‌ మండల అధ్యక్షులు జగదీష్‌ రెడ్డి, నగర ప్రధాన కార్యదర్శి కరీం, నగర డివిజన్‌ ఇంచార్జిలు భీమయ్య , ఉదరు, అదిశేషయ్య , రామాంజనేయులు , వెంకటేశ్వర్లు ఉన్నారు.