
కృష్ణాప్రతినిధి : రోడ్లపై విచ్చలవిడిగా చెత్త వేస్తే ఉపేక్షించేది లేదని మచిలీపట్నం నగర మేయర్ చిటికిన వెంకటేశ్వ రమ్మ హెచ్చ రించారు. స్థానిక 17 వ డివిజనులో బుధవారం ఆమె ఆకస్మిక పర్యటన చేసి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. రోడ్లపై పారవేసిన చెత్తా చెదారం ఉండటంతో పారిశుద్ధ్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపై చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మేయర్ నగర ప్రజలను కోరారు. ఈ పర్యటనలో డిప్యూటీ మేయర్లు మాడపాటి విజయలక్ష్మి, శీలం భారతి, పలువురు కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు ఉన్నారు.