ప్రజాశక్తి - చింతలపూడి
వైసిపి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రోడ్లకు కనీసం మరమ్మతులు కూడా చేపట్టలేదని, ముఖ్యంగా చింతలపూడి నియోజకవర్గంలో ప్రధాన రహదారులే కాక అంతర్గత రోడ్లన్నీ నడవడానికి కూడా లేకుండా అధ్వానంగా ఉన్నాయని, తక్షణం మరమ్మతులు చేపట్టాలని చింతలపూడి మాజీ ఎంఎల్‌ఎ ఘంగా మురళీరామకృష్ణ, ఎఎంసి మాజీ ఛైర్మన్ జగ్గవరపు ముత్తారెడ్డి, జనసేన నియోజకవర్గ కన్వీనర్ మేకా ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. కామవరపుకోట మండలంలోని గుంటుపల్లిలో చిధ్రమైన రోడ్లను అభివృద్ధి చేయాలంటూ నియోజకవర్గ టిడిపి, జనసేన నాయకులు శనివారం 'గుంతల ఆంధ్రాకు దారేది' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్లు అధ్వానంగా, భారీగోతులతో ప్రమాదకరంగా మారాయన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లను పట్టించుకున్న పరిస్థితి లేదన్నారు. గతంలో టిడిపి ఆధ్వర్యాన గుంతలు పూడ్చే కార్యక్రమం చేపడితే అడ్డుకున్నారని, ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే జనసేన, టిడిపి నాయకులు కలిసి ఉమ్మడి కార్యాచరణ చేపట్టి, గుంతలు పూడ్చే కార్యక్రమం చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన చింతలపూడి మండల అధ్యక్షులు చీదరాల మధుబాబు, టిడిపి నాయకులు యాళ్ల లీలాప్రశాంతి పాల్గొన్నారు.రోడ్లను అభివృద్ధి చేయాలని 'ఆంధ్రాకు దారేది'
ప్రజాశక్తి - చింతలపూడి
వైసిపి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రోడ్లకు కనీసం మరమ్మతులు కూడా చేపట్టలేదని, ముఖ్యంగా చింతలపూడి నియోజకవర్గంలో ప్రధాన రహదారులే కాక అంతర్గత రోడ్లన్నీ నడవడానికి కూడా లేకుండా అధ్వానంగా ఉన్నాయని, తక్షణం మరమ్మతులు చేపట్టాలని చింతలపూడి మాజీ ఎంఎల్‌ఎ ఘంగా మురళీరామకృష్ణ, ఎఎంసి మాజీ ఛైర్మన్ జగ్గవరపు ముత్తారెడ్డి, జనసేన నియోజకవర్గ కన్వీనర్ మేకా ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. కామవరపుకోట మండలంలోని గుంటుపల్లిలో చిధ్రమైన రోడ్లను అభివృద్ధి చేయాలంటూ నియోజకవర్గ టిడిపి, జనసేన నాయకులు శనివారం 'గుంతల ఆంధ్రాకు దారేది' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్లు అధ్వానంగా, భారీగోతులతో ప్రమాదకరంగా మారాయన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లను పట్టించుకున్న పరిస్థితి లేదన్నారు. గతంలో టిడిపి ఆధ్వర్యాన గుంతలు పూడ్చే కార్యక్రమం చేపడితే అడ్డుకున్నారని, ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే జనసేన, టిడిపి నాయకులు కలిసి ఉమ్మడి కార్యాచరణ చేపట్టి, గుంతలు పూడ్చే కార్యక్రమం చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన చింతలపూడి మండల అధ్యక్షులు చీదరాల మధుబాబు, టిడిపి నాయకులు యాళ్ల లీలాప్రశాంతి పాల్గొన్నారు.