ప్రజాశక్తి-నందిగామ: నందిగామ నియోజకవర్గంలోని పలు ఆర్‌అండ్‌బి రోడ్ల విస్తరణ, నిధుల మంజూరుపై ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్‌మోహన్‌రావు మంగళవారం చర్చించారు. విజయవాడ నగరంలోని రోడ్లు- భవనాలు శాఖ కార్యాలయంలో స్టేట్ హైవేస్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌అండ్‌బి చీఫ్ ఇంజనీర్‌లు వేణుగోపాల్ రెడ్డి, మేజర్ డిస్టిక్ రోడ్స్ చీఫ్ ఇంజనీర్ నయాముల్లాలను ఆయన కలిసి పనులపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారుల మరమ్మతుల పనులకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు.










