Nov 01,2023 01:13

మాట్లాడుతున్న ఎమ్మెల్యే గణేష్‌

ప్రజాశక్తి-గొలుగొండ:నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి రూ.10.4 కోట్ల నిధులు మంజూర య్యాయని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేష్‌ తెలిపారు. మంగళవారం గొలుగొండ మండల ంలోని వైసిపి ముఖ్య నాయకులు, బూత్‌ కమిటీ కన్వీనర్లతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గొలుగొండ మండలంలో కరక ఆర్‌అండ్‌బి రోడ్డు నుండి డొంకాడ ఒకటిన్నర కిలో మీటరు రోడ్డుకు రూ.1.35కోట్లు, పిఎన్‌బిపాలెం నుండి పెసరాడ, అప్పన్నపాలెం, కంఠారం, అడ్డలోవ గ్రామాల మీదుగా పప్పుశెట్టిపాలెం గ్రామానికి ఆరున్నర కిలో మీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి రూ.4కోట్ల 60లక్షల నిధులు మంజూరయ్యాయన్నారు. ఎన్‌.గదబపాలెం నుండి నిమ్మగెడ్డ వెళ్లే రోడ్డు బ్యాలెన్స్‌ రీచ్‌ రోడ్డుకు రూ.60లక్షలు,నాతవరం మండలం సుందరకోట నుండి అసనగిరి వెళ్లే రోడ్డుకు రూ.2.05కోట్లు, మాకవరపాలెం మండలం గిడుతూరు నుండి సుంకపూర్‌ వరకు రోడ్డుకు కోటి 85లక్షల నిధులు మంజూరయ్యాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలి కార్యక్రమాన్ని చీడిగుమ్మల నుండి ప్రారంభించడం జరుగుతుందన్నారు. సామాజిక సాధికార యాత్ర డిసెంబరు నెలాఖరులో నర్సీపట్నం చేరనుందన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రతీ సచివాలయానికి రూ.20లక్షల చొప్పున నిధులు మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. సమావేశం అనంతరం మండలంలోని ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు లెక్కల సత్యనారాయణ, జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు, ఎంపిపి గజ్జలపు మణికుమారి, మండల యూత్‌ అధ్యక్షులు మాకిరెడ్డి రామకృష్ణనాయుడు తదితరులు పాల్గొన్నారు.