ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : రోడ్ల నాణ్యతలపై బహిరంగ చర్చకు టిడిపి నాయకులు సిద్ధ మా అంటూ అంటూ వైసిపి నాయకులు సవాల్ విసిరారు. ఇటీవల ఎస్‌సి సెల్ అధ్యక్షులు తోటపల్లిగూ డూరు మండలం, కామాక్షినగర్ గ్రామంలో నిర్మించిన అంతర్గత రహ దారులు నాసిరకంగా ఉన్నాయంటూ విమర్శలు చేశారు. ఈ విమర్శలను శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసిపి ఎస్‌సి సెల్ నాయకలు ఎంబేటీ వీరరాఘవులు, దారా రాజేష్, హరికష్ణ, మనోహర్, ధనంజరు, ఈదూరు నరేంద్ర, వెంకటేశ్వర్లు తదితరులు తీవ్రంగా ఖండించారు. వారు మాట్లాడుతూ రోడ్లు నాసిరకంగా నిర్మించినట్లు ఎలా ధ్రువీకరిస్తారని వారు ప్రశ్నించారు. అభివద్ధి ఎవరి హయాంలో జరిగిందో ప్రజలకు తెలుసన్నారు. అ భివద్ధి అంటే రోడ్లపై రోడ్లు వే యడం కాదని వారు ఏద్దేవా చేశారు. టిడిపి ప్రభుత్వ పాలనలో నాసిరకంగా రోడ్లు నిర్మాణా లు చేపట్టి రూ. కోట్లు దోచుకొ న్న విషయం అందరికీ తెలుసుకున్నారు. అభివద్ధి అంటే పారిశుధ్యం, మంచినీటి సరఫరా, సంక్షేమ పథకాలు కూడా ఉంటాయిన టిడిపి నాయకులు తెలుసుకోవాలన్నారు.










