Jan 29,2023 00:05

దీక్షను చేపడుతున్న నేతలు

ప్రజాశక్తి- నర్సీపట్నం టౌన్‌ :నియోజవర్గంలో పాడైన ప్రధాన రోడ్లను బాగు చేయాలని జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త రాజన్న వీర సూర్య చంద్ర స్థానిక ఆర్డిఓ కార్యాలయం వద్ద శనివారం నిరవధిక నిరాహార దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గొలుగొండ మండలం చీడిగుమ్మల, యర్రవరం నుంచి అరిలోవ అటవీ ప్రాంతం, నాతవర,. తాండవ రోడ్డు మరమ్మతు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. గొలుగొండ మండలం ఆరిలోవ ప్రాంతంలో రోడ్డు అధ్వాన్నంగా ఉందని, తరచూ అనేక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. రాత్రి సమయాల్లో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. ఎమ్మెల్యే గణేష్‌ రోడ్డు అభివృద్ధికి కృషి చేయడం లేదని విమర్శించారు. అటవీశాఖ అనుమతులు ఇచ్చినప్పటికీ ఆర్‌అండ్‌బి శాఖ నుంచి రూ.40లక్షలు తీసుకు రావడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టౌన్‌ అధ్యక్షులు అద్దేపల్లి గణేష్‌, 9వ వార్డు జనసేన కౌన్సిలర్‌ అద్దేపల్లి సౌజన్య, ప్రోగ్రామ్‌ కమిటీ మెంబర్లు కొత్తకోట రామశేఖర్‌, పెనుపోతుల నాగు, మారిశెట్టి రాజా, చిరంజీవి శ్రీను, లంక పాత్రుడు పాల్గొన్నారు.