Aug 02,2023 22:10

రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే కళావతి

ప్రజాశక్తి- సీతంపేట : మండలంలోని దారబ పంచాయతీ పరిధిలో పి.హెచ్‌ రోడ్డు నుండి దిగువ దారబ వయా కర్రగూడ సిసి రోడ్డు వరకు రోడ్డు పనులకు బుధవారం ఎమ్మెల్యే విశ్వసరాయి.కళావతి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా రోడ్డు నిర్మాణం చేపట్టక అవస్థలు పడుతున్న దారబ పంచాయతీ పరిసర ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తొలగుతాయని చెప్పారు. రూ.37 లక్షలతో రోడ్డు పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపిపి బిడ్డిక ఆదినారాయణ, సవర రాము, పాలకొండ వ్యవసాయ మార్కెటింగ్‌ చైర్మన్‌ హిమరక మోహన్‌ రావు, సర్పంచ్‌ సవర. సిమ్మయ్య, ఎంపిటిసి నిమ్మక హరిప్రసాద్‌, నాయకులు సవర సాయికుమార్‌, సవర చెంచయ్య, తదితరులు పాల్గొన్నారు.
కిల్లారి కుటుంబానికి పరామర్శ
పాలకొండ : పట్టణంలో కిల్లారి సుగుణాకరరావునాయుడు అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకుని ఎమ్మెల్యే కళావతి పరామర్శించారు. మృతికి గల కారణాలను కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట వెలమల మన్మథరావు, దుప్పాడ పాపినాయుడు, కిల్లారి మోహన్‌, కడగల రమణ, కోడెం విజరుకుమార్‌ ఉన్నారు.