ప్రజాశక్తి-అరకులోయరూరల్:మండలలోని పద్మాపురం మేజర్ పంచాయితీ కేంద్రంలో డ్రైనేజీ అస్తవ్యస్తంగా మారింది. ఉషోదయ లాడ్జి వెళ్ళే దారిలో డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేక పోవడంతో మురుగునీరు చెత్తాచెదారంతో రోడ్డుపై ప్రవహిస్తోంది. దీంతో, రోడ్డంతా మురుగునీటితో నిండి దుర్వాసన వెదజల్లుతోందని గ్రామస్థులు వాపోతున్నారు. ఈ రోడ్డుపై వెళుతున్న స్థానికులు, పద్మావతి గార్డెన్ చూడనికి వెళ్ళే పర్యాటకులు ముక్కు ముసుకుని వెళ్ళవసిన పరిస్థితి వస్తుది. డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగునీరు ఎక్కడిక్కడ నిలిచి పోవడంతో దుర్వాసనతో పాటు దోమలు బెడద ఎక్కువైందని రాత్రివేళల్లో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు పేర్కొన్నారు. దోమలతో నిద్ర పట్టలేదని తెలిపారు. అధికారులు పట్టించు కోలేదని గ్రామస్థులు ఆరోపిం చారు. ఇప్పటికైనా మండల అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణం చేసి మురుగునీరు రోడ్డుపైకి రాకుండా చర్యలు చేపట్టాలని గ్రామస్థులు, యువకులు కోరుతున్నారు.










