రోడ్డుకు అడ్డంగా నేల కొరిగిన చెట్టు
ప్రజాశక్తి-జి.మాడుగుల:మండలంలో గెమ్మిలి పంచాయతీ ఊటపాలెం గ్రామ సమీపంలో రహదారికి మధ్యన భారీ వృక్షం నేల కొరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు..మంగళవారం ఉదయం వీచిన గాలికి భారీ వృక్షం నేల కొరిగిందని, ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు.వృక్షం కూలి పోవడంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.










