Sep 28,2023 19:12

ప్లెక్సీ వేసిన దృశ్యం

ప్లెక్సీ వేసిన దృశ్యం
రోడ్డుకు మరమ్మతులు చేపట్టండి సారూ..
ప్రజాశక్తి-కావలి:కావలిపట్టణ ప్రధాన రహదారి నాలుగున్నర సంవత్సరాలుగా రోడ్డు అధ్వానంగా ఉంది. ఈ రోడ్డుకు మరమ్మతులు చేపడతామంటూ ఇదిగో!అదిగో!అంటూ అధికారపార్టీ నాయకులు మభ్య పెడుతూనే ఉన్నారు. రెండేళ్ల నుంచి కావలిఎం.ఎల్‌.ఏ.రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి ఎక్కడ మాట్లాడినా కావలి ట్రంక్‌ రోడ్డు అభివద్ధి గురించే చెబుతున్నారు
తప్ప అది పూర్తి కావడం లేదు. అందుచేత విసిగిపోయిన ముసునూరు ఆటో నగర్‌ ప్రజలు బహిరంగంగా బయటపడి, ఇలా ఫ్లెక్సీ ద్వారా తమ నిరసన వ్యక్తం చేశారు. ఇక అధికార పార్టీ నేతలు, ఎం ఎల్‌ ఏ ఎలా ప్రతిస్పందిస్తారో చూడాల్సి ఉంది.