Aug 27,2022 19:53

కుందనకుర్తి అడ్డ రోడ్డుకిరువైపులా ఉన్న ముళ్లకంపను తొలగిస్తున్న సిబ్బంది

ప్రజాశక్తి - చిప్పగిరి
మండలంలోని కుందనకుర్తి బస్టాండ్‌ నుంచి గ్రామంలోకి వెళ్లే ఒక కిలోమీటర్‌ రహదారికి ఇరువైపులా ఉన్న ముళ్లకంపను సర్పంచి కొండా పురుషోత్తం ఆధ్వర్యంలో జెసిబి ద్వారా తొలగించారు. శనివారం సర్పంచి కొండా పురుషోత్తం మాట్లాడారు. గ్రామస్తులకు ఇబ్బంది ఉండకూడదని బస్టాండ్‌కు వెళ్లే రహదారికి ఇరువైపులా ఉన్న ముళ్లకంపను పంచాయతీ నిధులతో జెసిబి ద్వారా తొలగించామని తెలిపారు. హేమాంజనేయులు పాల్గొన్నారు.