Nov 08,2023 00:33

మాట్లాడుతున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి - మంగళగిరి : మంగళగిరి పట్టణంలోని తెనాలి రోడ్డు విస్తరణలో స్థలాన్ని కోల్పోతున్న భవన యజమానులకు భూ సేకరణ 2013 చట్టాన్ని అమలు చేసి న్యాయం చేయాలని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ఎస్‌ చెంగయ్య కోరారు. ఈ మేరకు స్థానిక సిపిఎం కార్యాలయంలో మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. టిడిఆర్‌ బాండ్లు కాకుండా నష్టపరిహారం నగదు రూపంలో ఇవ్వాలన్నారు. కమిషనర్‌తో జరిగిన సమావేశంలో భవన యజమానులు అడిగిన న్యాయమైన కోరికలను అమలు చేయాలని కోరారు. రోడ్డుకిరువైపులా స్థలాన్ని సమానంగా తీసుకోవా లన్నారు. దేవస్థానం వద్ద గడ్డర్లను ఏర్పాటు చేయడం వలన ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతోందని, గతంలో భారీ వాహనాలను కాకుండా, కారు ఆటోలను అనుమతించారని గుర్తు చేశారు. గడ్డర్లను తొలగించాలని కోరారు. సిపిఎం సీనియర్‌ నాయకులు జెవి రాఘవులు మాట్లాడుతూ పట్టా లేని వారి కూడా నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ప్రజలు కోరుకుంటున్న తెనాలి రోడ్డు విస్తరణ కార్యరూపం దాల్చడం లేదన్నారు. సమావేశంలో సిపిఎం సీనియర్‌ నాయకులు ఎం.పకీరయ్య, పి.బాలకృష్ణ పాల్గొన్నారు.