పొన్నూరు రూరల్: పొన్నూరు పట్టణంలో జరుగుతున్న జి బి సి రోడ్ విస్తరణ అభివృద్ధి పనులను ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య, తెనాలి డిఎస్పి బి. జనార్థనరావు తో కలిసి పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును మున్సిపల్ డి ఈ శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు నిబంధనల ప్రకారం విస్తరణ పనులను వేగవంతం చేయా లని సంబంధిత అధికారులను ఆదేశించారు.










