ప్రజాశక్తి - కురుపాం : మండలంలోని ఉదయపురం పంచాయతీలో పలు గిరిజన గ్రామాలకు రూ.63లక్షలతో మంజూరై రహదారి విస్తరణ పనులకు మంగళవారం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉదయపురం కాలనీ నుండి దాసుగూడ వరకు కిలోమీటరు రోడ్డుకు రూ.8లక్షలు, కాకితాడ నుంచి జురుడుగూడ వరకు 2.80 కిలోమీటర్లు రూ.24 లక్షలతో, కొత్తగూడ నుండి మల్లుగూడ వరకు ఒక కిలోమీటరు రూ.8 లక్షలతోనూ, కొత్తగూడ నుండి కంటుగూడ వరకు 2.70 కిలోమీటర్లు రూ.23 లక్షలతో మొత్తం 7.50 కిలోమీటరుల రూ.63 లక్షలతో రహదారి విస్తరణ పనులకు నిధులు మంజూరయ్యావని తెలిపారు. కార్యక్రమంలో ఎంపిపి శెట్టి పద్మావతి, వైస్ ఎంపిపి రంగారావు, వైసిపి గ్రీవెన్స్ జిల్లా అధ్యక్షులు శెట్టి నాగేశ్వరరావు, మండల కన్వీనర్ ఐ. గౌరీ శంకర్ , సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










