Sep 03,2023 21:14

ప్రజాశక్తి - చింతలపూడి
    మేడిశెట్టివారిగూడెంలో రోడ్డు గుంతలు పడి ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యను స్థానిక ఎంఎల్‌ఎ దృష్టికి తీసుకెళ్లి, రోడ్డు వేయిస్తామని చింతంపల్లి సర్పంచి తాండ్ర రామకృష్ణ తెలిపారు. చింతలపూడి మండలం మేడిశెట్టివారిగూడెంలో గుంతలలో ద్విచక్రవాహనం అదుపు తప్పి తల్లికొడుకులకు ప్రమాదమేర్పడడంతో గాయాలతో సత్తుపల్లి హస్పటల్‌కి స్థానికులు తరలించారు. దీంతో సర్పంచి స్పందించి తాత్కాలికంగా స్థానికులతో కలసి గ్రావెల్‌తో గుంతలను పూడ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్‌అండ్‌బి అధికారులకు గుంతలు పూడ్చాలని ఎన్నిస్లారు చెప్పినా గుంతలు పూడ్చటం లేదని ఆరోపించారు. గుంతలు పడి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, గుంతలతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ విషయం ఎంఎల్‌ఎ దృష్టికి తీసుకువెళ్లి శాశ్వత పరిష్కరానికి కృషి చేస్తామని తెలియజేశారు.