Jun 02,2023 23:51

నినాదాలు చేస్తున్న గిరిజనులు

ప్రజాశక్తి-హుకుంపేట: నూతనంగా రహదారి నిర్మాణం చేపట్టాలని మండలంలోని బూర్జ పంచాయతీ 5 గ్రామ ప్రజలు విన్నవించారు. ఈ సందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ, సులిపకన్‌ నుంచి వాలసి వరకు నూతనంగా రహదారి నిర్మించాలని గ్రామ ప్రజలు కోరారు. ఈ రహదారి గుండా 5గ్రామాల ప్రజలు రాక పోకలు సాగిస్తుంటారని తెలిపారు. ఎగ సలతంగి, డిగ సలతంగి, కొండరు పాడు, సునిపాకన్‌, సొంటర్ల పాడు గ్రామాల ప్రజలు ఈ రహదారి మీదుగా 2 కిలోమీటర్ల దూరంగా తగ్గడంతో వాలసి నిమ్మల పాడుకు వెళుతుంటారన్నారు. రహదారి నిర్మాణం చేపట్టక పోవడంతో శుక్రవారం పాడేరు స్పందలో జిల్లా కలెక్టర్‌కు పిర్యాదు చేశామని వారు తెలిపారు.