బ్రహ్మంగారిమఠం : మండలంలోని కొత్త బస్వాపురం గ్రామంలోని సమస్యలపైన చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు ఐదవ రోజున ధర్మశెట్టి రాజేష్‌కు సిపిఎం మండల కార్యదర్శి గోవింద్ మద్దతిచ్చారు. రాజేష్‌కు పూలమాల వేసి దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా గోవింద్ మాట్లాడుతూ తెలుగుగంగ అంతర్భాగమైన బ్రహ్మసాగర్ ప్రాజెక్టులో ముంపునకు గురై సుమారు 40 సంవత్సరాలు గడుస్తున్నా కొత్త బస్వాపురం గ్రామానికి తెలుగుగంగకు వెళ్లే ప్రధాన రహదారి నుండి 650 మీటర్ల దూరం వరకు తారు రోడ్డుకు, సిమెం టు రోడ్డుకు గాని నోచుకున్న దాఖలాల్లేవని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారని అన్నారు. గ్రామానికి ఏళ్ల తరబడి సంబంధిత తెలుగుగంగ అది óకారులు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు గ్రామానికి తరచూ రాక పోకలు సాగిస్తున్నప్పటికీ ఏ ఒక్కరూ అధ్వాన్నంగా ఉన్న ఈ రోడ్డును పట్టిం చుకున్న పాపానపోలేదన్నారు. 15వ వార్డు మెంబర్‌తోపాటు గ్రామస్తులు రోడ్డు వేయాలని బిక్షాటన చేసినా, రిలే నిరాహార దీక్ష చేపట్టినా అధికారులు, నాయకులు స్పందించలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు పూర్తి చేసి గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని నాయ కులు హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు గండి సునీల్‌కుమార్, ఎద్దు రాహుల్, భాస్కర్, బిగ్‌బాస్ పాల్గొన్నారు.దీక్షలకు మద్దతిస్తున్న సిపిఎం నాయకులు










