రోడ్డు పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు
ప్రజాశక్తి -తగరపువలస : జివిఎంసి ఒకటో జోన్ పరిధి చిల్లపేట జంక్షన్ నుంచి బొగ్గు రోడ్డు వరకు రూ.75 లక్షలతో నిర్మించనున్న తారు రోడ్డు పునర్నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధాన, శివారు ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి, విస్తరణకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు. అభివృద్ధి, సంక్షేమానికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. జోనల్ కమిషనర్ బొడ్డేపల్లి రాము, పిఎసిఎస్ అధ్యక్షులు అక్కరమాని రామునాయుడు, జివిఎంసి కో-ఆప్షన్ సభ్యులు కొప్పల ప్రభావతి, వైసిపి నాయకులు కొప్పల కృష్ణ, చినబాబు, జీరు సుజాత తదితరులు పాల్గొన్నారు.










