Jun 01,2023 19:06

ఘటన స్థలంలో పడి ఉన్న క్షతగాత్రుడు

ప్రజాశక్తి - ఆస్పరి
మండలంలోని రామతీర్థం కొండ సమీపంలో ఆదోని, పత్తికొండ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరిజన హనుమంతు (28)కు గాయాలయ్యాయి. గ్రామస్తుల వివరాల మేరకు... శంకరబండ గ్రామానికి చెందిన హరిజన హనుమంతు గురువారం పని నిమిత్తం ఆస్పరికి వచ్చారు. పని ముగించుకొని బైక్‌పై గ్రామానికి వెళ్తుండగా ఆదోని నుంచి గుత్తికి వెళ్తున్న లారీని ఢ కొట్టారు. హనుమంతు ఎడమ కాలు విరిగింది. హనుమంతును ఆస్పరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు మెరుగైన వైద్యం కోసం ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ కూడా వైద్యులు మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రి తరలించారు. ఈయనకు భార్య అరుణ, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వరప్రసాద్‌ తెలిపారు.