Aug 14,2023 21:33

సంఘటనా స్థలంలో మృతి చెందిన వసంత

సీతంపేట: మండలంలోని గోయిది సమీపాన ఆటో, ద్విచక్ర వాహనం ఢకొీనడంతో బైక్‌ మీద వెళ్తున్న పి.వసంత (18) మతి చెందింది. వివరాల్లోకెళ్తే బూర్జ మండలం లాభం గ్రామానికి చెందిన వెంకటేష్‌, గుత్తవిల్లికి చెందిన పైడి వసంతి పాలకొండలోని ఒకే కాలేజీలో డిగ్రీ చదువుతున్నారు. సోమవారం వీరు బైక్‌పై సీతంపేట పార్క్‌ నుంచి తిరిగి ఇంటికి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ఆటో ఢకొీంది. దీంతో ఇద్దరూ అపరస్మాత స్థితిలో ఉండటంతో 108 వాహనం ద్వారా పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా వసంత మార్గమధ్యలోనే మతి చెందింది.అకస్మాత స్థితిలో వెంకటేష్‌ చికిత్స పొందుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న సీతంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.