మరొకరికి గాయాలు
ప్రజాశక్తి - భీమడోలు
జాతీయ రహదారిపై కురెళ్లగూడెం సమీపంలో శుక్రవారం అర్థరాత్రి చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా, మరొక యువకుడు తీవ్ర గాయాల పాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు పూళ్ల గ్రామానికి చెందిన పన్నా ఈశ్వర ఫణికుమార్(17) తన స్నేహితుడు అదే గ్రామానికి చెందిన కొత్తపల్లి మనోజ్‌తో కలిసి అల్పాహారం కోసం మోటారు బైకుపై శుక్రవారం అర్థరాత్రి పూళ్ల-కురెళ్లగూడెం గ్రామాల మధ్య ఉన్న దాబాకు బయలుదేరారు. మార్గమధ్యలో అదే మార్గంలో విజయవాడ వైపు వెళుతున్న లారీని వెనుక నుంచి ఢ కొన్నారు. ఈ సంఘటనలో ఫణికుమార్ ఘటనాస్థలిలోనే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మనోజ్‌ను చికిత్స నిమిత్తం ఏలూరు వైద్యశాలకు తరలించారు. ఫణికుమార్ తాడేపల్లిగూడెంలోని ఒక ప్రెయివేట్ కళాశాలలో ఇంటర్‌మీడియట్ చదువుతున్నారు. ఫణికుమార్ మృతికి సంతాప సూచికగా శుక్రవారం కళాశాలకు యాజమాన్యం సెలవు ప్రకటించింది. కేసును భీమడోలు పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.










