చీరాల : గుర్తుతెలియని వాహనం ఢకొీని ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మతి చెందిన సంఘటన చీరాల ఒంగోలు బైపాస్ రోడ్డు లోని మన్నం అపార్ట్మెంట్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. వేటపాలెం మండలం సమైక్య నగర్‌కు చెందిన యలవర్తి క్రాంతి(30) అనే యువకుడు తన ద్విచక్ర వాహనంపై చీరాల నుంచి వేటపాలెం వెళ్లేందుకు బైపాస్ రోడ్డులో వెళ్తుండగా మన్నం అపార్ట్మెంట్ వద్ద వేగంతో ప్రయాణిస్తున్న గుర్తుతెలియని వాహనం ఒక్కసారిగా ఢ కొట్టింది.దీంతో వాహనదారుడు అక్కడికక్కడే మతి చెందాడు. విషయం గమనించిన స్థానికులు గమనించి 108కు సమాచారం అందించారు. అయితే అప్పటికే మతి చెందినట్లు సిబ్బంది నిర్ధారించారు.సమాచారం అందుకున్న రెండో పట్టణ పోలీసులు మత దేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.










