మృతిచెందిన హరిబాబు
ప్రజాశక్తి-ఉక్కునగరం : అగనంపూడి నుంచి కూర్మన్నపాలెం వెళ్లే జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నెల్లి హరిబాబు (32) దుర్మరణం పాలయ్యాడు. దువ్వాడ పోలీసుల కథనం ప్రకారం... హరిబాబు అగనంపూడిలో నివాసం ఉంటున్నాడు. ఫార్మాసిటీ కాలనీలో ఫ్యాబ్రికేషన్స్ వర్క్ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం అగనంపూడి నుంచి కూర్మన్నపాలెం వైపు ద్విచక్రవాహనంపై వెళుతున్న సమయంలో భారీ వాహనం ఢకొీట్టింది. దీంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. దువ్వాడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కెజిహెచ్‌కు తరలించారు. మృతుడు హెల్మెట్ వాడకపోవడం, అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా పోలీసులు తేల్చారు. ఎస్‌ఐ రాధాకృష్ణ, దేవుడుబాబు దర్యాప్తు చేపట్టారు.










