Nov 23,2022 22:59

ప్రజాశక్తి-మైలవరం

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మారణం చెందిన సంఘటన బుధవారం జి. కొండూరు మండలం గుర్రాజు పాలెం రహ దారి వద్ద జరిగింది. వివరాల ప్రకారం మైలవరం లోని సూరిబాబు పేటకు చెందిన కటారి వెంకటేశ్వరరావు (35) తాపీ పని చేస్తుంటాడు. పనుల నిమిత్తం తన ద్విచక్ర వాహనంపై జి. కొండూరు వైపు వెళుతున్నాడు. తెలంగాణ రాష్ట్రం విఎం బంజర కు చెందిన అయ్యప్ప స్వామి భక్తులు మిని బస్సులో శబరిమలై వెళ్లి వస్తుండగా గర్రాజుపాలెం సమీపంలో వెంకటేశ్వరరావు ద్విచక్ర వాహనం అదుపు తప్పి మినీ బస్సు ను ఢకొీంది. ఈ ఘటనలో వెంకటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకొన్న జి కొండూరు ఎస్‌ఐ ధర్మరాజు మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ ఐ తెలిపారు.