రోడ్డు ప్రమాదంలో వ్యక్త్తి మృతి
రోడ్డు ప్రమాదంలో వ్యక్త్తి మృతి
ప్రజాశక్తి - ఓజిలి: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన బుధవారం మండలంలో ఉదయం చోటు చేసుకుంది. చిల్లకూరు మండలం పిడతలపూడి గ్రామానికి చెందిన యనమల వెంకటేశ్వర్లు (46) ద్విచక్ర వాహనంపై ఓజిలి నుంచి చిల్లకూరు వైపు వెళుతుండగా రాజుపాలెం జాతీయ రహదారి వద్ద అదే మార్గంలో వెళుతున్న ఏపీ 12 యు 9166 నెంబర్ కలిగిన లారీ వెనుక నుండి ఢ కొనడంతో వెంకటేశ్వర్లుకు తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం టోల్ ప్లాజా హైవే మొబైల్ అంబులెన్సులో గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఓజిలి ఏఎస్‌ఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.










