
ప్రజాశక్తి - వీరవాసరం
బావమరిది పెళ్లి నిమిత్తం బంధువులకు శుభలేఖలు పంచేందుకు బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని లారీ ఢకొీనడంతో అతడు మృతి చెందాడు. ఈ ఘటన వీరవాసరం వద్ద జాతీయ రహదారి 165పై బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలకోడేరు మండలం విస్సాకోడేరుకు చెందిన మరివాడ తారకరామారావు (43) పెన్నాడ వద్ద వంకాయలపాలెం రైల్వే గేటుమాన్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో తన బావమరిది పెళ్లి నిమిత్తం బంధువులకు శుభలేఖలు పంచేందుకు బుధవారం బైక్‌పై రావులపాలెం, యానాం బయలుదేరాడు. వీరవాసరం తూర్పు చెరువు సెంటర్ సమీపంలోకి వచ్చేసరికి వెనుక నుంచి లారీ ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో తారకరామారావు లారీ చక్రాల కింద పడడంతో తలకు తీవ్ర గాయామై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ రమేష్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సిఐ నాగప్రసాద్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎస్‌ఐ రమేష్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం తరలించారు.