Sep 02,2023 00:28

ప్రజాశక్తి - చీరాల
గుర్తుతెలియని వాహనం ఢీకొని ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చీరాల - ఒంగోలు బైపాస్ రోడ్డులోని మనం అపార్ట్మెంట్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. అందిన వివరాల మేరకు చీరాల - ఒంగోలు జాతీయ రహదారిలోని మన్నం అపార్ట్మెంట్ వద్ద ద్విచక్ర వాహనదారుడును కొత్త తల్లిని వాహనం ఢీకొనింది. దీంతో వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు గమనించి 108వాహనంకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి వచ్చిన సిబ్బంది వ్యక్తి మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న రెండో పట్టణ పోలీసులు మృత దేహాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.