మృతిచెందిన వరలక్ష్మి
ప్రజాశక్తి -ఉక్కునగరం : దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధి అగనంపూడి ట్రాఫిక్ సిగల్ పాయింట్ వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వివాహిత బొడ్డెడ వరలక్ష్మి (38) మృతి చెందింది. దువ్వాడ పోలీసుల కథనం ప్రకారం... మృతురాలు వరలక్ష్మి, భర్త రాముతో అక్కిరెడ్డిపాలెంలోని డెయిరీ ఫామ్ కాలనీలో నివాసం ఉంటున్నారు. శనివారం యలమంచిలిలోని కుమార్తె ఇంటికి వెళ్లి తిరిగి రాత్రి 8 గంటల సమయంలో ద్విచక్రవాహంపై ఇంటికి వస్తున్నారు. అగనంపూడి వచ్చేసరికి రాజమండ్రి నుంచి వస్తున్న బస్సు ఢకొీనడంతో వరలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. దువ్వాడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కెజిహెచ్‌కు తరలించారు.










