Oct 19,2023 20:40

ఘటనా స్థలంలో సరస్వతి మృతదేహం

ప్రజాశక్తి-దత్తిరాజేరు : గొట్లాం నుంచి చెల్లూరు వెళ్లే బైపాస్‌ రోడ్డులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దత్తిరాజేరు మండలం కన్నాం సర్పంచ్‌ చుక్క సన్యాసిరావు భార్య చుక్క సరస్వతి (55) మృతి చెందారు. భార్యాభర్తలిద్దరూ రయింద్రం గ్రామంలో జరిగిన ఓ ఫంక్షన్‌లో పాల్గొని విశాఖపట్నం కారులో వెళ్తున్నారు. కోరాడపేట బ్రిడ్జి వద్ద గడ్డితో వెళ్తున్న ట్రాక్టర్‌ ఢకొీనడంతో సరస్వతి సంఘటన స్థలంలోని మృతి చెందారు. సర్పంచ్‌ సన్యాసిరావుకు స్వల్ప గాయాలయ్యాయి. విజయనగరం రూరల్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.