Aug 17,2023 00:04

ప్రజాశక్తి - మాచర్ల : వెల్దుర్తి మండలం ఉప్పలపాడులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కె.శ్రీనివాసరావు (45) బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మధ్యాహ్నం ఉప్పలపాడు నుండి మాచర్ల వస్తుండగా ద్విచక్ర వాహనాన్ని మండాది సమీపంలోని రచ్చమల్లపాడు రోడ్డు వద్ద గుర్తు తెలియని వాహనం ఢకొీనడంతో శ్రీనివాసరావు మృతి చెందారు. ఏలూరు ప్రాంతానికి చెందిన శ్రీనివాసరావు ఏడాది క్రితం బదిలీపై ఈ ప్రాంతానికి వచ్చారు. శ్రీనివాసరావు కుటుంబం విజయవాడలో ఉంటుండగా ఆయన మాత్రం మాచర్లలో అద్దె ఇంట్లో ఉంటూ రోజు ఉప్పలపాడుకు వెళ్లి వస్తున్నారు. మృతునికి భార్య, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. శ్రీనివాసరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వాస్పత్రికి తరలించి సమాచారాన్ని కుటుంబీకులకు అందించారు. వెల్దుర్తి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.