Sep 13,2023 22:12

మృతి చెందిన శంకర్‌

బొబ్బిలి: పట్టణంలోని రైల్వే ఫ్లై ఓవర్‌ శ్రీఆంజనేయ స్వామి ఆలయం వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సాలూరు పట్టణంలోని కర్రి వీధికి చెందిన జి. శంకర్‌(35) దుర్మరణం చెందగా ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వివరాలు మేరకు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు మోటారు సైకిల్‌ పై మితిమీరిన వేగంతో వెళ్తూ నడుచుకుని రోడ్డు దాటుతున్న ఒక వ్యక్తిని ఢకొీనడంతో అతని అక్కడికక్కడే దుర్మరణం చెందగా మోటారు సైకిల్‌ పై వెళ్తున్న యువకులు పవన్‌, హేమంత్‌, జోసెఫ్‌ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ముగ్గురిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.