Sep 03,2023 19:33

మృతదేహల వద్ద రోధిస్తున్న బంధువులు

ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు సింగరాయకొండ మధ్యలో ఉన్న మలినేని లక్ష్మయ్య ఇంజనీరింగ్‌ కళాశాలకు అతి సమీపంలో ఉన్న ఎస్సార్‌ పెట్రోల్‌ బంకు వద్ద సింగరాయకొండ నుంచి కందుకూరు వస్తున్న లారీ, కందుకూరు నుంచి సింగరాయకొండ వైపు వెళుతున్న ద్విచక్ర వాహనం ఢకొీని అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. ద్విచక్ర వాహనపై ప్రయానిస్తు వారు మతి చెందినట్లు ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఉన్న వారు తెలిపారు. మతి చెందిన వారు కందుకూరు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కాంపౌండర్‌ గా పనిచేస్తున్న సాయి, మరొకరు సాయి మిత్రుడు తెలుస్తుంది. గత రెండు రోజుల క్రితమే సాయి నూతన గహప్రవేశం చేశారని వారి బంధువులు తెలిపారు. అక్కడే ఉన్న వారి బంధువులు. లారీ డ్రైవర్‌ అక్కడ నుంచి పరారైపోయారని బంధువులు తెలిపారు.చనిపోయిన వారివద్ద బందువులు రోదిస్తున్నారు.పోలీసులు సంఘటన స్థనానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.