రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
ప్రజాశక్తి - గడివేముల
గడివేముల మండలం గడిగరేవుల- తిరుపాడు గ్రామాల మధ్య కారు, టివిఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనం ఢకొీని నంద్యాలకు చెందిన షేక్ ఇలియాస్ (65), నరసింహులు (40)లు మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నంద్యాల పట్టణానికి చెందిన షేక్ ఇలియాస్ (65) షేక్ ఇలియాస్‌కు ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె, రెండవ భార్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. షేక్ ఇలియాస్ గతంలో నందికొట్కూర్‌లో మిడుతురు వెళ్లే టర్నింగ్ వద్ద బెంగళూరు బేకరి పేరుతో బేకరి షాప్ నిర్వహించేవాడు. రోడ్డు వెడల్పులో రూమ్ కట్ చేయడంతో నంద్యాలలోని సాయిబాబా పేటలో బెంగళూరు బేకరీ షాప్ నిర్వహిస్తున్నాడు. షేక్ ఇలియాస్ కారులో కుమారునితో కలిసి నందికొట్కూరుకు బయల్దేరాడు. అలాగే నంద్యాలకి చెందిన నరసింహులు (40) బొగ్గులైన్‌లో నివాసముంటూ హమాలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఉదయం పని నిమిత్తం నందికొట్కూ రుకు టివిఎస్ ఎక్స్‌ల్ ద్విచక్ర వాహనంపై వెళ్లి తిరుగు పయనమయ్యాడు. గడివేముల మండలం గడిగరేవుల- తిరుపాడు గ్రామాల మధ్య మలుపు వద్దకు రాగానే అదుపు తప్పి ఎదురెదురుగా ఢకొీన్నారు. నరసింహులు అక్కడికక్కడే మృతి చెందాడు. కారు పొలాల్లోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టడంతో షేక్ ఇలియాస్ కూడా అక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.










