Mar 16,2023 22:45

మృతిచెందిన యువకులు

ప్రజాశక్తి-ఉక్కునగరం : అగనంపూడి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. గురువారం ఉదయం అగనంపూడి నుంచి లంకెలపాలెం వైపు వెళ్లే రహదారిలో ఓ లారీ మరమ్మతుల నిమిత్తం నిలిపి ఉంది. అదే దారిలో వేగంగా వస్తున్న ద్విచక్ర వాహనం ఆగి ఉన్న లారీని తప్పించుకొని వెళుతున్న క్రమంలో వెనకనుంచి వచ్చిన టిప్పర్‌ బలంగా ఢకొీట్టింది. ఇద్దరు యువకుల తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాద విషయం తెలుసుకున్న దువ్వాడ ట్రాఫిక్‌ సిఐ ఉమామహేశ్వరరావు, లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. వాహన రిజిస్ట్రేషన్‌ శ్రీకాకుళం జిల్లాకు చెందినదిగా ఉందని, బండి నెంబర్‌ ఆధారంగా మృతుల వివరాలు కనుక్కుంటున్నామని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కెజిహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.