బస్సు చక్రాల కిందపడి మృతి చెందిన గిరిజనులు
ప్రజాశక్తి - సీతంపేట : మండలంలోని తుమ్మన్నకాలనీకి చెందిన ఆరిక సింధు (45) పులిపుట్టి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే తుమ్మన్న కాలనీకి చెందిన సింధు కొత్తూరు పని నిమిత్తం వెళ్లారు. పని ముగించుకొని కొత్తూరులో ఆర్టీసీ బస్సు ఎక్కి పులిపుట్టి వద్ద బస్సు దిగాడు. ఈలోగా బస్సు ముందు భాగం వైపు వెళ్లడంతో బస్సు కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య మేరీతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.










