ప్రజాశక్తి- సబ్బవరం : రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థినికి మిత్రులు రూ.1,41,100 మేరకు ఆర్థిక సహాయం అందజేశారు. గత నెల 31న వంగలి రోడ్డులో రెండు ఆటోలు ఢకొీన్న ఘటనలో అంతకాపల్లి పంచాయితీ శివారు ఒమ్మివాని పాలెం గ్రామానికి చెందిన కోన సరస్వతికి రెండు కాళ్ళు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న మిత్రులు సబ్బవరంకు చెందిన చలుమూరి పుష్ప భర్త సురేష్, వారి మిత్రులు, 2001 ప్రభుత్వ హైస్కూల్ పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు, మాడుగుల మండలానికి చెందిన బోయపాడు ఎరిణివేణి భర్త రవి, ఖండివరం మహేష్, దేవరపల్లి అనిత భర్త వెంకటరావు, వారి మిత్రులు కలిసి సేకరించిన రూ.1,41,100ను సరస్వతికి ఆర్థిక సహాయం కింద గురువారం అందజేశారు. ఆర్థిక సహాయ దాతలకు సరస్వతి తల్లిదండ్రులు దేముడు, అప్పలకొండ కృతజ్ఞతలు తెలిపారు.










