బ్రేక్ ఇన్‌స్పెక్టర్ శివప్రసాద్,
చెన్నూరు : మండల శివారులోని ఆలంఖాన్‌పల్లె సర్కిల్ వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. విధి నిర్వహిణలో ఉన్న కడప బ్రేక్ ఇన్‌స్పెక్టర్ శివప్రసాద్, ఆయన సహాయకుడు కేశవులు కలిసి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. మైదుకూరు వైపు నుండి కడకు వస్తున్న లారీ అతివే గంగా డివైడర్‌ను ఢకొీంది. అనంతరం పక్కనే ఉన్న ఎంవిఐ కారును ఢకొీంది. ఈ ప్రమాదంలో వారివురు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీస్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి లారీ డ్రైవర్ తప్పిదంతో ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు. చెన్నూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.










