ప్రజాశక్తి -పాయకరావుపేట: కృత్రిమ మేధా రవాణా వ్యవస్థ మెరుగు పరచడంతో ట్రాఫిక్‌ను మెరుగు పరచి ప్రమాదాలు నివారించవచ్చని కేంద్ర రహదారి పరిశోధనా సంస్థ ట్రాఫిక్ మరియు రవాణా ప్రణాళిక విభాగపు విశ్రాంత విభాగాధిపతి టిఎస్ రెడ్డి తెలిపారు. శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అనుబంధ సంస్థ స్పేసేస్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు కృత్రిమ మేధా రవాణా వ్యవస్ధను మెరుగు పరచడంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో అయన విద్యార్థులతో ఆదివారం ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుత కాలంలో సాంకేతికను ఉపయోగించి రవాణా వ్యవస్థను కృత్రిమ మేధా వ్యవస్థతో ఆధునీకరించడంతో ప్రమాదాల నివారణ సాధ్యపడుతుందని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కృత్రిమ మేధ రవాణా వ్యవస్ధ ద్వారా ఆలస్యపు ప్రయాణాలు అధిగమించడం, ట్రాఫిక్ నివారణ, వేగ నియంత్రణ, వాహన కాలుష్య నివారణ వంటివి సాధ్యపడతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అధినేత సిహెచ్ వికే నరసింహారావు, డైరెక్టర్ డాక్టర్ వివిఎస్ బి.బంగార్రాజు, ప్రిన్సిపల్ కె.వీర్రాజు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.










