Oct 09,2023 20:32

రోడ్డు ప్రమాదాలపై అవగాహనవాహన

నిమ్మనపల్లి : అప్రమత్తంగా ఉంటేనే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చునని ఎస్‌ఐ రామకష్ణ అన్నారు. సోమవారం స్థానిక ఆటో డ్రైవర్లకు, ప్రజలకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ ప్రస్తుతం అతి వేగము వలన తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగి, అనేక మంది వికలాంగులు అవుతున్నారని, మత్యువాత పడుతున్నారని అన్నారు. యువకులందరూ విధిగా ట్రాఫిక్‌ నియమ నిబందనలను పాటించాలని, వాహనాలను నడిపేటపుడు హెల్మెట్‌ ఖచ్చితముగా ధరించాలన్నారు. ఆటో డ్రైవర్లు మధ్యము సేవించి వాహనాలు నడుపరాదని, ప్రమాదాలు జరుగకుండా అన్ని జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. అధిగ శబ్ధాలను కలిగించే సైలెన్సర్లను బిగుంచుకొని ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్థిం చరాదన్నారు. శబ్ద కాలుష్యాన్ని కలిగించే వారిపై చర్యలు తీసుకుంటా మన్నారు. రోడ్డు నియమాలను, నిబందనలను పాటించని వారిపై కటిన చర్యలు తీసుకొంటా మని హెచ్చరించినారు.