గొల్లపూడి బైపాస్ రోడ్డులో సిఐటియు నిరసన
ప్రజాశక్తి - భవానీపురం
రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని సిఐటియు పశ్చిమ సిటీ కార్యదర్శి బోయి సత్యబాబు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈనెల 18వ తేదీన గొల్లపూడి గాంధీజీ హాోల్‌సేల్ కమర్షియల్ కాంప్లెక్స్‌లోని గరుడ ట్రాన్స్‌ఫోర్టులో పని ముగించుకుని అర్థరాత్రి సమయంలో ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న ఇద్దరు కార్మికులు మృతిచెందిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో గొల్లపూడి బైపాస్ రోడ్డులోని కమర్షియల్ కాంప్లెక్స్ గేటు ముందు శనివారం సిఐటియు పశ్చిమ సిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బోయి సత్యబాబు మాట్లాడుతూ గొల్లపూడి కాంప్లెక్స్‌లో పనిచేసుకుని ఇళ్ళకు వెళ్లే క్రమంలో ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదంలో కార్మికులు చాలామంది మృత్యువాత పడుతున్నారని తెలిపారు. ఈ ప్రాంతంలో స్పీడ్ బ్రేకర్లు వేయకపోవటం వల్ల టిప్పర్లు అతి వేగంగా ప్రయాణిస్తుండటంతో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని వాపో యారు. ఈ ప్రమాదాల నివారించాలంటే సిగల్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, వెనువెంటనే స్పీడ్ బ్రేకర్లు వేయాలని పోలీసు, విఎంసి అధికారులకు బోయి సత్యబాబు కోరారు. ఈ కార్యక్రమంలో ముఠా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) పశ్చిమ నగర సహాయ కార్యదర్శి జి. వెంకట్రావు (చౌదరి), సి.హెచ్. దాసు, రాజా, మస్తాన్, రమణ, గురవా రెడ్డి, దేవుడు, శ్రీను, రామారావు, అంజి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










