Oct 01,2023 21:48

జిల్లా రవాణా అధికారి పి. దినేష్‌చంద్ర

రాయచోటి : జిల్లాలో ట్రాఫిక్‌ నియమ నిబంధనలను పాటించి రోడ్డు ప్రమాదాల నివారించడమే తమ లక్ష్యమని జిల్లా రవాణా అధికారి పి.దినేష్‌ చంద్ర పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలో రోడ్డు భద్రత నిబంధనలు పాటించి వాహనదారులు ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజాశక్తికి ఇచ్చిన ముఖావ ుుఖిలో ఆయన వివరించారు.
అన్నమయ్య జిల్లాల్లో రవాణా కార్యాలయాల వివరాలు తెలపండి?
జిల్లా వ్యాప్తంగా రాయచోటి, మదనపల్లిలో ఆర్‌టిఒ కార్యాలయాలు, రాజంపేట, పీలేరు ప్రాంతాల్లో మోటర్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయాలున్నాయి.
పాఠశాలల బస్సులకు ఎటువంటి నిబంధన ఉండాలి?
పాఠశాల బస్సు డ్రైవర్‌కు డ్రైవింగ్‌ లైసెన్స్‌ తప్పనిసరిగా ఉండాలి. 750కిలీలకుపైగా బరువు ఉంటే హెవీ లైసెన్స్‌ తప్పనిసరిగా ఉండాలి. ఐదు సంవత్సరాలు సీనియారిటీ ఉండాలి. 60 సంవత్సరాల దాటిన వ్యక్తి డ్రైవింగ్‌ చేయకూడదు. బస్సులకు పసుపు కలర్‌ రంగు ఉండాలి. చిల్డ్రన్స్‌ బొమ్మలు కూడా ఉండాలి. డోర్‌ పక్కన పాఠశాల అడ్రస్‌ ఫోన్‌ నెంబర్‌ ఏర్పాటు చేసుకోవాలి. అలాగే బస్సులో ఎమర్జెన్సీ దారి ఏర్పాటు చేసుకోవాలి. డ్రైవర్‌ వెనుక భాగంలో రూట్‌ మ్యాప్‌ ఉండాలి. 15 సంవత్సరాలు పూర్తయిన వాహనానికి తిప్పకూడదు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి డ్రైవర్‌ మెడికల్‌ సర్టిఫికెట్‌ తెచ్చుకోవాలి. బస్సు పూర్తి కండిషన్‌లో ఉండాలి.
డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఏ పద్ధతి లో మంజూరు చేస్తున్నారు ?
మాన్యువల్‌ టెస్టింగ్‌ స్థానంలో కొత్తగా సాంకేతిక విధానాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించాయి. డ్రైవింగ్‌ లైసెన్స్‌ టెస్ట్‌ విధానంలో కొత్త మార్పులను తీసుకొస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మోటర్‌ వెహికల్‌ చట్టానికి అనుకులంగా లైసెన్సులు జారీ చేస్తున్నాం. ఆధార్‌ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఎపి ఆర్‌టిఎ డాట్‌ సిటిజన్‌లో చలానా కట్టుకోవాలి. లేకపోతే మీ సేవలో చలానా కట్టుకొని కట్టుకోవాలి. 18 సంవత్సరాల పూర్తయిన వారు మాత్రమే అర్హులు. రవాణా అధికారుల పర్యవేక్షణలో డ్రైవింగ్‌ విధానాన్ని వాహనదారుడు వాహనాన్ని నడిపితే ఆర్‌టిఒ సంతప్తి చెందుతూ అతనికి లైసెన్స్‌ మంజూరు చేస్తారు. లైసెన్సులను కూడా ఇంటికి పంపిస్తున్నాం.
ఫెయిల్‌ అయినా అభ్యర్థి ఎన్ని రోజులలో తిరిగి డ్రైవింగ్‌ టెస్ట్‌కు హాజరు కావాలి ?
వాహనదారుడు ఫెయిల్‌ అయిన అభ్యర్థి ఒక నెల తర్వాత దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల లోపల వాహనదారుడు డ్రైవింగ్‌ శిక్షణ తీసుకుని హాజరుకావాలి.
రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
నెలకొకసారి జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన ఎసిపి ఇతర శాఖలతో ప్రమాదాలపై సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. పదేపదే ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి ఆ ప్రదేశంలో సూచిక బోర్డులు, స్పీడ్‌ బ్రేకర్‌ ఏర్పాటు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఆగస్టు నెలలో 'రక్తం చిందించిన రోజు' అనే నినాదంతో రోడ్డు భద్రత వారోత్సవాలను నిర్వహిస్తున్నాం.
డ్రైవర్లకు ఎలాంటి సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు ?
వాహనం నడుపుతున్న ప్రతి డ్రైవరూ ట్రాఫిక్‌ నియను నిబంధన పాటించాలి. మద్యం సేవించి వాహనం నడపరాదు. మద్యం సేవించి వాహనదారుడు వాహనాన్ని నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకొని జేసులు నమోదు చేస్తున్నాం. ద్విచక్ర వాహనం వాహనదారులు హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలి. అలాగే వాహనదారులు సీటు బెల్టు ధరించి ధరించాలి. ఎనిమిది గంటల ప్రయాణం దాటితే 2వ డ్రైవర్‌ను ఏర్పాటు చేసుకోవాలి. రాత్రి వేళల్లో ప్రయాణాలు నివారించాలి. అత్యంత పరిస్థితి లో మాత్రమే ప్రయాణించాలి. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి అందరూ సహకరించాలి.