Feb 14,2023 23:55

జెడ్‌పిటిసి గంగరాజు


ప్రజాశక్తి-అనంతగిరి:పారెస్టు అధికారుల అభ్యంతరాలతో నిలిచి బొంగిజా, డెక్కపురం రోడ్లను వెంటనే పనులు పున్ణప్రారంభించాలని జెడ్పీటీసీ. దీసరి గంగరాజు డిమాండ్‌ చేశారు. మంగళవారం జెడ్పీటీసీ తో పాటు లుంగపర్తి, కివర్ల పంచాయతీ సర్పంచ్‌ బృందం కివర్ల పంచాయతీ బొంగిజా రోడ్డు ను పరిశీలించారు. గ్రామస్తులు రోడ్డు సౌకర్యం లేక పడుతున్న కష్టలను గంగరాజుకు వివరించారు .అనంతరం జడ్పీటీసీ దీసరి గంగరాజు మాట్లాడుతూ, గత ఆర్థిక సంవత్సరంలోనే జిల్లా పరిషత్‌ చైర్మన్‌ జల్లిపల్లి సుభద్ర సహకారంతో అనంతగిరి మండలంలో రూ.10. కోట్లతో 5 రోడ్లు మంజూరు చేయించడం జరిగిందన్నారు. లంగుపర్తి పంచాయతీ చిడివలస గ్రామం నుండి కివర్ల పంచాయతీ బొంగిజా గ్రామం వరకు 2 కోట్లా 40 లక్షలతో రోడ్డు మంజూరై రోడ్డు పనులు జరుగుతుండగా జీనబాడు ఫారేస్ట్‌ రేంజ్‌ అధికారుల అభ్యంతరంతో గుత్తేదారులు పనులు నిలిపి వేశారన్నారు.అనేక సార్లు కలెక్టర్‌ దృష్టికి తీసుకు వెళ్ళి పిర్యాదు చేశామన్నారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడినా ఫారెస్టు అధికారులు అనుమతులు ఇవ్వకుండా గిరిజనుల అభివృద్ధికి అడ్డుపడుతున్నారన్నారు. ఈ నెల 23న జరగనున్న జిల్లా పరిషత్‌ సమావేశంలో ఈ సమస్యను తెలుపుతానన్నారు. ఈ కార్యక్రమంలో కివర్ల సర్పంచ్‌ పుట్టబోయిన ముత్యాలమ్మ, లంగుపర్తి సర్పంచ్‌ సివేరి. సన్యాసిరావుదొర, వేంగడ మాజీ సర్పంచ్‌ సివేరి కొండలరావు, అనంతగిరి సిపిఎం మండల కార్యదర్శి సోమేల నాగులు, చొంపి వెంకటరావు, సూకురు గంగన్న, పుట్టబోయిన. దేముడు, పి.సోమన్న, కురిడెబోయిన లచ్చన్న, బొంగిజ గ్రామం ప్రజలు పాల్గొన్నారు. a