Oct 27,2022 23:23

పనులు పరిశీలిస్తున్న జెడ్‌పిటిసి గంగరాజు

ప్రజాశక్తి -అనంతగిరి:మండలంలోని వాలసి పంచాయతీ పరిధి ఊటగడ్డ గ్రామంలో జరుగుతున్న రోడ్డు పనులను స్థానిక సిపిఎం జెడ్పిటిసి దీసరి గంగరాజు గురువారం పరిశీలించారు. ఆయన కృషితో రోడ్డు మంజూరైంది. ఈ సందర్భంగా గంగరాజు మాట్లాడుతూ, జెండగరువు నుండి ఎత్తయిన కొండల మధ్య నుండి ఊటగడ్డ గ్రామంలో సుమారు మూడు కిలోమీటర్ల వరకు రోడ్డు నిర్మించేందుకు కోటి 20 లక్షలతో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులు మంజూరు చేయించడం జరిగిందని ఆయన అన్నారు. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ దృష్టికి ఈ సమస్య తీసుకెళ్లడంతో స్పందించిన వెంటనే నిధులు మంజూరు చేసినందుకు గ్రామస్తుల కృతజ్ఞతలు తెలపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ సేంబి సన్యాసిరావు పాల్గొన్నారు.