Jun 25,2023 21:55

ఫొటో : రోడ్డు పనులు చేపడుతున్న టిడిపి కావలి నియోజక వర్గ ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు

రోడ్డు పనులు చెపట్టిన మాలేపాటీ
- అడ్డుకున్న ఆర్‌అండ్‌బి అధికారులు
ప్రజాశక్తి-కావలి : తుమ్మలపెంట రోడ్డు ఎన్నో ఏళ్లుగా జగన్‌ ప్రభుత్వం నిర్లక్యం చేస్తుంటే, పనులు చేయాలంటూ టిడిపి పలుమార్లు ఆందోళనలు చేసినా స్థానిక ఎం.ఎల్‌.ఎ. పట్టించుకోకపోయే సరికి తీరప్రాంత గ్రామాల ప్రజల ఇబ్బందులు చూడలేక టిడిపి కావలి నియోజక వర్గ ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు ఆదివారం తన స్వంత ఖర్చులతో జెసిబిలు పిలిపించి రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభించారు. అయితే ఆయన చేసే పనులు ఆపేందుకు సాయంత్రంలోపే చేపట్టిన మాలేపాటి సుబ్బానాయుడును కావలి ఆర్‌అండ్‌బి ఎఇ భరత్‌ రెడ్డి కలిశారు.
సుబ్బానాయుడు చేపడుతున్న నిర్మాణ పనులను ఆపాలని కోరారు. ఈ మేరకు స్థానిక ప్రజానీకం ఎందుకు ఆపాలని ప్రశ్నిస్తూ ప్రస్తుత ప్రభుత్వం పనులు చేయదని, చేసేవారిని అడ్డు చెప్పడం ఎంతవరకు న్యాయం అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ఆర్‌ అండ్‌ బి అధికారి మాట్లాడుతూ వారం రోజులు గడువు ఇవ్వాలని కోరారు. స్పందించిన సుబ్బానాయుడు మాట్లాడుతూ ఇప్పటికే తమకు, తమ శాసనసభ్యులకు ఇచ్చిన సమయం వృథా అయిపోయిందని, ఇంకా ఏ నమ్మకంతో సమయం అడుగుతున్నారో చెప్పాలని తెలిపారు. మత్స్యకార గ్రామాలు అంటే శాసనసభ్యులకు ఎందుకంత ద్వేషమో చెప్పాలని ప్రశ్నించారు. నిర్మాణ పనుల నిమిత్తం కంకరు, అవసరమైన పరికరాలను ఏర్పాటు చేసుకొని సిద్ధంగా ఉన్నాయని, బుధవారం లోపు అధికారులు చర్యలు చేపట్టకపోతే మరుసటి రోజే తానే రోడ్డు నిర్మాణం చేపడు తానని ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఆర్‌ అండ్‌ బి కార్యాలయాన్ని ముట్టడిస్తానని హెచ్చరించారు.