Sep 28,2022 23:04

నిరసన చేపడుతున్న నేతలు

ప్రజాశక్తి -అరకులోయ :మండలంలోని బస్కి పంచాయితీ గుగ్గుడు రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం మండల కార్యదర్శి కిండంగి రామారావు, మాజీ ఎంపిటిసి బురిడి దశరథ్‌ ఆధ్వర్యంలో గ్రామస్థులు బుధవారం నిరసన చేపట్టారు. రోడ్డు ప్రారంభించి ఏడాది పూర్తి కావస్తున్నా ఎక్కడి పనులు అక్కడే వదిలి వేయడాన్ని ఆగ్రహించిన గ్రామస్తులు నిరసనకు దిగారు. చిన్న పాటి వర్షం కురిసినా రోడ్డు అస్తవ్యస్తంగా మారి ప్రమాదాలకు తావిస్తుందన్నారు. అసంపూర్తిగా వదిలేసిన రోడ్డు పనులు ప్రారంభించక పోతే ఆందోళన మరింత చేస్తామని వారు హెచ్చరించారు. నాయకులు షోర్రు, జగన్‌, పాల్గొన్నారు.